కౌంటింగ్‌ ఆపేయండి..సుప్రీంకోర్టు వెళ్లా..ట్రంప్‌

కౌంటింగ్‌లో మోసం..ట్రంప్‌

trump

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల ఫలితాలు తుది దశకు వస్తున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ప్ర‌జ‌ల పట్ల ఇది మోసం అని, మ‌న దేశానికి ఇది అవ‌మాన‌క‌ర‌మ‌ని అన్నారు. వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల‌ను తామే గెలిచామ‌ని, కానీ దేశంలో స‌మ‌గ్ర‌త‌ను అమలు చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అని ఆయ‌న అన్నారు. అమెరికా చ‌రిత్ర‌లో ఈ ఎన్నిక‌లు అసాధార‌ణ‌మ‌ని, రికార్డు స్థాయిలో ఓటింగ్ జ‌రిగింద‌న్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌క్రియ‌పై క‌ట్టుదిట్ట‌మైన చ‌ట్టాన్ని త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ట్రంప్ అన్నారు. మిలియ‌న్ల సంఖ్య‌లో ఉన్న పోస్ట‌ల్ ఓట్ల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాల‌ని అధ్యక్షుడు కోరారు. ప్ర‌స్తుతం వ‌స్తున్న ఫ‌లితాల ఆధారంగా బైడెన్ ముందంజ‌లో ఉన్నారు. ట్రంప్ కూడా మ్యాజిక్ మార్క్‌కు ద‌గ్గ‌ర‌గా స‌మీపిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం బైడెన్ 237, ట్రంప్ 213 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలుచుకున్నారు. కానీ ఇంకా కీల‌క రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/