ఆ అధ్యక్షుడిని చంపిద్దామనుకున్నా..ట్రంప్‌

వద్దని చెప్పిన డిఫెన్స్‌ సెక్రటరీ మాటిస్

Trump says he wanted to kill Syria’s Assad

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను చంపించాలనుకున్నానని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… అసద్‌ను చంపే విషయంపై తాము గతంలో ఓ నిర్ణయానికి కూడా వచ్చానని, అయితే, మాఋ డిఫెన్స్‌ సెక్రటరీ మాటిస్ ఇందుకు అంగీకరించలేదని ఆయన చెప్పారు. దీంతో తాను ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానని ఆయన ప్రకటించారు.

అయితే, తన దృష్టిలో మాటిస్ ఓ ఘోరమైన సైనిక జనరల్ అని ఆయన వ్యాఖ్యానించారు. అసద్‌ను చంపిచాలనుకున్న తన నిర్ణయాన్ని అమలు చేయకపోవడంపై తాను ఏమీ బాధపడలేదని తెలిపారు. కాగా, ఇదే విషయంపై గతంలో మాత్రం ట్రంప్‌ మరోలా మాట్లాడారు. అసద్‌ను చంపించాలన్న యోచనే తనకు రాలేదని గతంలో ఆయన అన్నారు. అమెరికా జర్నలిస్టు బాబ్ వుడ్‌వర్డ్ 2018లో ఓ పుస్తకంలో అసద్‌ను చంపించాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక గురించి మొదటిసారిగా ప్రస్తావించారు. అంతకు ముందు ఏడాది సిరియా పౌరులపై రసాయన దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు అసద్ ప్రభుత్వమే కారణమని ట్రంప్ ఆయనను చంపించానుకున్నట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/