కరోనా సంక్షోభంపై ట్రంప్‌ అంచనా

వచ్చే ఆగస్టు వరకూ ఈవైరస్‌ కొనసాగే అవకాశం వుందని అంచన వేసిన ట్రంప్‌

trump
trump

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈవైరస్‌ సంక్షోభం వచ్చే ఆగస్టు వరకూ కొనసాగే అవకాశం వుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంచనా వేశారు. ఈ వైరస్‌ మహమ్మారి ప్రభావాన్ని తప్పించుకునేందుకు అమెరికా ప్రజలు తమను తాము గృహనిర్బంధం చేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అమెరికా దేశవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్‌ కేసులు 4,500కు పైగా నమోదు కాగా, 85 మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వైరస్‌ నానాటికీ వేగంగా విస్తరిస్తుండటంతో దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పర్యాటక ఆంక్షలు, స్కూళ్లు, రెస్టారెంట్లు, బార్‌ల మూసివేత, వినోద కార్యక్రమాల రద్దు వంటి చర్యలు చేపట్టింది. వైట్‌హౌస్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘ఈ మంచి పని కూడా చేయలేకపోతే మనం కరోనా వైరస్‌ మరణాలను తక్కువ స్థాయికి తేలేం.. కానీ ప్రజలు మాత్రం జులై, ఆగస్టు గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయానికి కరోనా బెడద తొలగిపోతుందని భావిస్తున్నాన’ని అన్నారు.

తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/