కిమ్‌ ‌పై కీలక అంశాన్ని వెల్లడించిన ట్రంప్‌

2013లో తన అంకుల్ నే చంపేసిన కిమ్

TRUMP, KIM

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ గతేడాది భేటి అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటిలో కిమ్‌ తనకు చెప్పిన అనేక విషయాలను ట్రంప్‌ ఓ పుస్తక రచయితకు వెల్లడించారు. తల లేకుండా ఉన్న తన అంకుల్ మొండేన్ని ఉత్తర కొరియా సీనియర్ అధికారులకు చూపించినట్టు కిమ్ తనతో చెప్పారని ట్రంప్ వివరించారు. 2013లో కిమ్ తన అంకుల్ జాంగ్ సోంగ్ థైక్ ను అత్యంత దారుణ శిక్షతో హతమార్చాడు. ఆయనపై దేశద్రోహం, అవినీతి ఆరోపణలు మోపిన కిమ్… ఓ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ తో మరణశిక్ష అమలు చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ, ‘కిమ్ నాకు అన్నీ చెబుతాడు, చెప్పాడు కూడా’ అని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కిమ్ తన అంకుల్ ను చంపి మెట్లపై పడేశాడు. ఆ మృతదేహానికి తల లేదు’ అని ట్రంప్ వివరించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/