చైనాపై మరోసారి మండిపడ్డ ట్రంప్
మరణాల విషయంలో అమెరికా, చైనా దరిదాపుల్లోకి కూడా వెల్లదు

వాషింగ్టన్: కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాపై అమెరికా అథ్యక్షుడు ట్రంప్ మరోసారి మండిపడ్డాడు. తాజా చైనా కోవిడ్ మరణాల సంఖ్యను సవరిస్తు అధికారిక ప్రకటన చేసింది. ఇందులో కరోనా మరణాలను 50శాతం దాకా పెంచింది.దీంతో చైనా లో కరోనా మరణాల సంఖ్య 4,632 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అథ్యక్షుడు చైనాపై నిప్పులు చెరిగారు. కోవిడ్ మరణాల సంఖ్యను చైనా రెట్టింపు చేసింది. మృతుల సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుంది. వాస్తకానికి అమెరికా కంటే ఎక్కువే ఉంటుంది. మరణాల విషయంలో అమెరికా చైనా దరిదాపుల్లోకి కూడా వెల్లదు అని ట్రంప్ అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/