కశ్మీర్‌ అంశంపై ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

ట్రంప్‌ చెవికెక్కని భారత్ వాదన

Trump
Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కశ్మీర్‌ అంశంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌భారత్‌ కోరితే కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి వ్యాఖ్యానించారు. అయితే కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వంపై భారత్‌ స్పందనను ప్రస్తావిస్తూ శ్వేతసౌధంలో గురువారం ఓ విలేకరి లేవనెత్తిన ప్రశ్నకు బదులిస్తూ..ఆ విషయాన్ని ప్రధాని మోదీకే విడిచిపెడుతున్నాను అని ట్రంప్‌ ఖ్యానించారు. పైగా తన మధ్యవర్తిత్వానికి భారత్‌ అంగీకరించిందా? లేదా? అని విలేకరుల నుంచి స్పష్టత కోరే ప్రయత్నం చేశారు. ఖఖనాకు తెలిసినంత వరకు ఇమ్రాన్‌ ఖాన్‌, మోడి అద్భుతమైన వ్యక్తులు. వారి మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ వారు ఎవరైనా జోక్యం చేసుకోవాలని భావిస్తే దానికి నేను సిద్ధం. ఈ అంశంపై నేను పాకిస్థాన్‌తో చర్చించాను. భారత్‌తో కూడా ధైర్యంగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశానుగగ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

కాగా కశ్మీరుపై సహాయపడగల అవకాశం వస్తే మధ్యవర్తిగా వ్యవహరించడానికి ఇష్టపడతానని ఇటీవల పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ అమెరికాలో పర్యటించిన సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/