నవంబరు కంటే ముందే వ్యాక్సిన్

తన వల్లే ఇంత త్వరగా వ్యాక్సిన్ వస్తోందని వ్యాఖ్యలు

Trump

వాషింగ్టన్‌: మరో మూడ్నాలుగు వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్నిరోజుల కిందట నవంబరు నాటికి వ్యాక్సిన్ రావొచ్చన్న తన వ్యాఖ్యలను సవరించుకుని, నవంబరు కంటే ముందే వ్యాక్సిన్ రాబోతోందని ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ లభ్యతకు చాలా దగ్గరగా వచ్చేశామని, అది కేవలం కొన్నివారాల దూరంలోనే ఉందని వివరించారు. అంతేకాదు, కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ఇంత త్వరగా రావడానికి కారణం తానేనంటూ పరోక్షంగా కితాబిచ్చుకున్నారు. ప్రభుత్వంలో మరెవరైనా ఉండుంటే కరోనా వ్యాక్సిన్ రావడానికి ఏళ్లు పట్టేదని అన్నారు. ఇక తనకుమాత్రమే సాధ్యమైన రీతిలో మరో వ్యాఖ్య కూడా చేశారు. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనా దానంతట అదే మాయమైపోతుందని పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/