కరోనా నేపథ్యంలో ట్రంప్ తీరు బాగోలేదు

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అధ్యక్షుడు ట్రంప్ కరోనా వైరస్ను నియంత్రంచడంలో విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. అయితే కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ట్రంప్ తీరు బాగోలేదని ఆయన అన్నారు. ఆయన ఒకరితో చేసిన సంభాషణ బయటకు వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలలే గడువు ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ సంభాషణ ఆసక్తికరంగా మారింది. కరోనాను ట్రంప్ ఎదుర్కొంటున్న తీరు గందరగోళంగా ఉందని ఒబామా చెప్పారు. స్వార్థం, విభజన, ఇతరుల పట్ల ద్వేషం వంటి పోకడలు ప్రస్తుతం అమెరికావాసుల జీవితాల్లో భాగమయ్యాయయని ఆయన అన్నారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదేతీరు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/