జి-7 సదస్సుకు మోడిని ఆహ్వానించిన ట్రంప్‌

చైనా మధ్య సరిహద్దు వివాదంపై చర్చించుకున్నమోడి, ట్రంప్

Trump-modi
Trump-modi

న్యూఢిల్లీ: అమెరికాలో జరిగే జీ7 సదస్సుకు హాజరు కావాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని నరేంద్రమోడిని ఆహ్వానించారు. మంగళవారం రాత్రి ప్రధాని మోడి, ట్రంప్‌ ఫోన్‌లో సంభాషించుకున్నారు. కరోనా నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వోలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చిందని ఓ అధికార ప్రకటనలో తెలిపారు. భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదంపై కూడా వారిరువురు చర్చించుకున్నట్లు పేర్కొన్నారు. ఫ్లాయిడ్‌ హత్యోదంతం అనంతరం అమెరికాలో వెల్లువెత్తుతున్న నిరసనలపై మోడి ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కనుగొనాలని ట్రంప్‌కు సూచించారు. ట్రంప్‌తో వివిధ అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయని మోడి ట్వీట్‌ చేశారు. కరోనా అనంతర పరిస్థితులకు అనుగుణంగా జీ7 గ్రూప్‌ను విస్తరించాలని ప్రయత్నించడం ట్రంప్‌ ముందుచూపుకు నిదర్శనమని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఉత్పన్నమవుతున్న వాస్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జీ7 గ్రూప్ ను మరింతగా విస్తరించాలన్న మీ దూరదృష్టి అమోఘమని ట్రంప్ ను కొనియాడారు. ఈ క్రమంలో అమెరికా, ఇతర దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ ఎంతో సంతోషిస్తుందని తెలిపారు. కాగా ఇంతకుముందు జీ7 కూటమిని విస్తరించాలని, భారత్‌ తదితర దేశాలకు సభ్యత్వం కల్పించాలని ట్రంప్‌ సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/