ట్రంప్‌ అభిశంసన.. పలువురి డిమాండ్‌

trump
trump

వాషింగ్టన్‌: అధికార దుర్వినియోగం, కాంగ్రెస్‌ను అడ్డుకోవడం అనే రెండు అభియోగాలపై సెనేట్‌లో అభిశంసన ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను దోషిగా తేల్చాలని కోరుతూ వందలాది మంది అమెరికన్లు ప్రదర్శన నిర్వహించారు. సెనెటోరియల్‌ ఆఫీస్‌ బిల్డింగ్‌ ఎదుట జరిగిన ఈ మౌన ప్రదర్శనలో చికాగో, తదితర సుదూర ప్రాంతాల నుంచి ప్రదర్శకులు బస్సుల్లో తరలి వచ్చారు. ప్రగతిశీల బృందాలు, పౌర , మహిళా మార్చ్‌, ఇతర హక్కుల సంఘాలు, సంస్థలు సంయుక్తంగా ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి. ట్రంప్‌ తప్పు చేశారనడానికి స్పష్టమైన ఆధారాలు, సాక్ష్యాలు వున్నా వాటిని పరిగణనలోకి తీసుకోవడానికి రిపబ్లికన్‌ సెనేటర్లు నిరాకరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగువ సభ ఆమోదించి పంపిన అభిశంసన తీర్మానం పై సోమ, మంగళ వారాల్లో తూతూ మంత్రంగా చర్చ జరిపి బుధవారం ఓటింగ్‌లో తిరస్కరించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ట్రంప్‌ను ఈ అభిశంసన నుంచి బయటపడేసేందుకు జరుగుతున్న యత్నాలను అడ్డుకోవాలని ప్రదర్శకులు డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ను అభిశంసించాల్సిందేనని వారు నినదించారు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/