సిరియాలో తాత్కాలిక కాల్పుల విరమణ

syria firing
syria firing

వాషింగ్ట్‌న్‌: గత కొన్నిరోజులుగా సిరియాలో కుర్దులకు, మిలటరీల మధ్య జరుగుతున్న కాల్పులకు తాత్కాలిక విరమణ లభించింది. ఇందుకు కారణం అమెరికా, టర్కీల మధ్య జరిగిన శాంతియుత ఒప్పందంగా చెప్పొచ్చు. ఐదురోజుల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు సిరియా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ ప్రకటించారు. ఈమేరకు కుదిరిన ఒప్పందానికి అంగీకరించిన టర్కీ అధ్యక్షుడు ఎడ్రోగాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించారు. ట్రంప్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దీనివల్ల అందరికీ మేలు జరుగుతుందని, వారు సరైన నిర్ణయం తీసుకున్నారంటూ మెచ్చుకున్నారు. టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎడ్రోగాన్‌తో ఇటీవల సమావేశం జరిగిన తర్వాత టర్కీలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ ప్రకటించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/