కమలా హారిస్ ప్రచారానికి ట్రంప్ విరాళాలు

రాజకీయాల్లోకి రాకముందు విరాళాలు

kamala-harris-trump

వాషింగ్టన్: కమలా హారిస్ పేరును డెమోక్రాట్లు తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు, కమలా హారిస్ ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ భారీగానే విరాళాలు ఇచ్చారు. హారిస్ ప్రచారానికి సెప్టెంబర్ 2011లో 5 వేల డాలర్లు, ఫిబ్రవరి 2013లో 1000 డాలర్లు, ఆపై 2014లో 2 వేల డాలర్ల విరాళాలను ఇచ్చినట్టు రికార్డులు చూపుతున్నాయి. అప్పట్లో ఆయన రాజకీయాల్లోకి ఇంకా ప్రవేశించలేదు. ఓ వ్యాపారవేత్తగానే ఉన్నారు. ఇక, 2015లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి రిపబ్లికన్ల మద్దతు కూడగట్టుకుంటున్న వేళ, గతంలో ఆయన ఇచ్చిన డొనేషన్లను చారిటీ సంస్థలకు తాను ఇచ్చేశానని కమలా హారిస్ స్వయంగా తెలిపారు. 2011 నుంచి 2016 వరకూ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా కమలా హారిస్ పనిచేశారన్న సంగతి తెలిసిందే. ఆపై 2016లో ఆమె సెనేట్ కు ఎన్నికయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/