హోంల్యాడ్‌ సెక్యూరిటీ సైబర్‌ చీఫ్‌పై వేటు

trump-fired-homeland-cyber-chief

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకాలు జరిగాయని ట్రంప్‌ చేసిన ఆరోపణులను ఖండిస్తూ..అధ్యక్ష ఎన్నికలు భద్రంగా నిజాయతీగా జరిగాయని వెల్లడించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సైబర్ చీఫ్ క్రిస్టోఫర్ క్రెబ్స్‌ను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తొలగించారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన క్రెబ్స్‌ను 2018 లో ట్రంప్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీకి (సీఐఎస్‌ఏ) మొదటి డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. 2020 ఎన్నికల భద్రతపై తన ప్రకటన ‘సరికాదని’ పేర్కొంటూ ట్రంప్ ట్విట్టర్‌లో క్రెబ్స్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ట్విట్టర్ రెండు ట్వీట్లను హెచ్చరిక లేబుళ్ళతో ఫ్లాగ్ చేసింది, ఎన్నికల మోసం గురించి ఈ వాదన వివాదాస్పదంగా ఉందని, 2020 ఎన్నికల భద్రతపై క్రిస్ క్రెబ్స్ ఇటీవల చేసిన ప్రకటన సరికాదన్నారు.

ఇందులో భారీగా అక్రమాలు, మోసాలు జరిగాయని, చనిపోయిన వారి పేరిట ఓట్లు వేశారని, ఓటింగ్‌ ఆలస్యంగా జరగడం, పోల్‌ వాచర్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించలేదని, ఓటింగ్‌ యంత్రాల్లో ‘అవాంతరాలుగ ఏర్పడ్డాయిగ అని ట్వీట్‌ చేశారు. ఎన్నికలపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను క్రిస్‌ క్రెబ్స్‌ ఖండించారు. ఖఅధ్యక్షుడి వాదనలు ఆధారాలు లేనివి, సాంకేతికంగా అసంబద్ధమైనవి’ క్రెబ్స్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ట్రంప్‌ సైసా సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/