కిమ్‌ ఆరోగ్యం కథనాలపై స్పందించిన ట్రంప్‌

కిమ్ ఆరోగ్యంపై వస్తున్న కథానాల్లో నిజం లేదు..ట్రంప్ ఆగ్రహం

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అనారోగ్యంపై స్పందించారు. కిమ్‌ అనారోగ్యంపై వచ్చిన కథనాలు నిరాధారమైనవిగా ట్రంప్‌ పేర్కొన్నారు. అంతేకాక ఈకథనాలు ప్రచురించిన సంస్థలపై ఆయన తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శ్వేతసౌధంలో జరిగిన మీడిమా సమావేశంలో మాట్లాడిన ట్రంప్‌ కిమ్‌ ఆరోగ్యం పై వచ్చిన కథనాలో నిజం లేదని కొట్టిపరేశారు. కాగా కిమ్‌ ఆరోగ్యంపై ఉత్తర కొరియా నుండి ఏదైనా సమాచారం వచ్చిందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానకి నిరాకరించారు. మరోవైపు కిమ్‌ ఆరోగ్యంపై ఉత్తర కొరియా ఇప్పుడే ఏమీ చెప్పలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/