ఆసక్తిరంగా మారిన ట్రంప్ వ్యాఖ్యలు

Trump comments
Trump comments

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం జరుగుతున్న తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. తాజాగా రిపబ్లికన్ జాతీయ కమిటీ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన ఎఫ్‌-22 యుద్ధ విమానాలపై చైనా జెండాలు అమర్చి రష్యాపై బాంబులు వేయాలని సూచించారు. చైనాయే ఆ పని చేసిందని అమెరికా చెప్పాలని, దీంతో రష్యా, చైనా కొట్టుకుంటూ వుంటే మనం చూసి ఎంజాయ్ చేయ‌చ్చ‌ని హాస్యమాడారు. దీంతో సభలోని వారంతా ఒక్కసారిగా నవ్వడంతోపాటు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరో దేశంపై రష్యా ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదని ట్రంప్‌ గుర్తు చేశారు. ‘బుష్ ఆధ్వర్యంలో జార్జియాపై రష్యా దాడి చేసింది. ఒబామా హయాంలో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుందని, ఇపుడు బైడెన్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగింది’ అంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/