ఫ్లోరిడాకు అడ్రస్‌ మార్చిన ట్రంప్‌

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్లోరిడాలోని ఫామ్‌ బీచ్‌ను తన శాశ్వత చిరునామాగా మార్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. న్యూయార్క్‌ నగరమంటే తనకు ఇష్టమేనని అయితే ఇన్నేళ్లుగా అక్కడ పన్నుల రూపంలో తాను బిలియన్ల డాలర్లు చెల్లించినప్పటికీ ఈ నగర రాజకీయవేత్తలు తనను సరిగా చూడటం లేదని ఆయన వాపోయారు. శాశ్వత చిరునామా మార్పుపై ఇటీవలే మెలానియా ట్రంప్‌ దరఖాస్తు చేసుకున్నఉట్ల వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడిగా మరో అయిదేళ్లు వైట్‌హౌజ్‌లోనే ఉంటానని ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికాను మరోసారి గొప్పగీ తీర్చిదిద్దాలన్సిన బాద్యత తనపై ఉందని ఆయన చెప్పారు. ట్రంప్‌ శ్వేతసౌథంతో పాటు మార్‌ ఎ లాగో రిసార్ట్స్‌లో ఉంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్‌ టవర్‌లో 20 రోజులున్నారు. అయితే పన్లున నుంచి తప్పించుకునేందుకు ఆయన తన చిరునామాను మార్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/andhra-pradesh/