చైనాకు రుణ పరపతి ఎందుకు?

trump
trump

వాషింగ్టన్‌: చైనాకు రుణ పరపతిని అందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ బ్యాంకును నిలదీసారు. చైనా వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని అవసరమైతే తిరిగి రుణపరపతి కల్పించే స్థాయి ఉందని ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఎందుకు రుణ పరపతిని కల్పిస్తున్నట్లుని ట్రంప్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. 18 నెలల పాటు కొనసాగించిన ట్రేడ్‌వార్‌కు ముగింపు పలికేందుకు చేస్తున్న సంప్రదింపులు కొలిక్కి రాకపోవడంతో ఇపుడు చైనాకు ప్రపంచ సంస్థలు అందిస్తున్న చేయూతపై ట్రంప్‌ దృష్టి పెట్టారు. ఆర్థికంగా బలంగా ఉన్న చైనాకు ప్రపంచ బ్యాంకు రుణం అవసరం లేదని చెపుతున్నారు. అక్టోబరులోనే ట్రేడ్‌వార్‌పై ఒప్పందానికి రావచ్చని భావించిన ట్రంప్‌ అందుకు వీలు కాకపోవడం ఇప్పటికీ ఇంకా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తుండటంతో చైనా ఆర్థిక మూలాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఎందుకు ప్రపంచ బ్యాంక్‌ చైనాకు రుణ పరపతి ఇస్తోంది. వెంటనే నిలిపి వేయాలంటూ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై హుకుం జారీ చేసారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/