చికాగో కంటే అప్ఘనిస్థానే సురక్షితం

trump
trump

వాషింగ్టన్‌: చికాగో నగరం కంటే అప్ఘనిస్థానే సురక్షితమైన ప్రాంతమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అఫ్ఘాన్‌ కంటే చికాగోలోనే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రంప్‌ అన్నారు. చికాగో నగరంలో పోలీస్‌ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడారు. చికాగోలో హత్యల ఘటనలు పెరిగిపోయాయి. అభద్రతా భావం నెలకొంది. నేరాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. 2001, సెప్టెంబర్‌ 11న ట్విన్‌ టవర్స్‌పై తాలిబన్లు దాడికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన జరిగినప్పటి నుంచి ఉగ్రవాద నిర్మూలనపై అమెరికా నిరాటంకంగా పోరాడుతున్నది. చికాగోలో నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. నేరాల నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించాం. అయితే, ఈ భేటీలో చికాగో ఎస్సీ ఎద్దీ జాన్సన్‌ హాజరుకాకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి అధికారుల కారణంగానే చికాగోలో నేరాల సంఖ్య తగ్గడం లేదని భావిస్తున్నాను అని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/