ఆయుధ నియంత్రణపై ట్రంప్‌, పుతిన్‌ సంభాషణ

putin and trump
putin and trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు వ్లదిమిర పుతిన్‌తో ఆదివారం టెలిఫోన్‌లో సంభాషించుకున్నారు. ఆయుధ నియంత్రణ, ద్వైపాక్షిక సంబంధాలు తదితర అంశాలపై వీరిరువురు నేతలు చర్చించుకున్నట్లు వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపాయి. అయితే ఈ చర్చల వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. రష్యాపై దాడికి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన కుట్రను భగం చేసినట్లు మాత్రం అది వెల్లడించింది. పుతిన్‌, ట్రంప్‌కు ఫోన్‌ చేసి ఇరు దేశాల సంబంధాల గురించి చర్చించారని వైట్‌ హౌస్‌ తెలిపింది. రష్యాలో సెలవు రోజున ఉగ్రవాద దాడికి కుట్ర జరుగుతున్నట్లు అమెరికా సమాచారం ఇచ్చినందున ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకే పుతిన్‌ ఫోన్‌ చేశారని వైట్‌ హౌస్‌ ప్రతినిధి హోగన్‌ గిడ్లీ అన్నారు. అమెరికా, రష్యా మధ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు రెండు దేశాలు అధ్యక్షులు చర్చించినట్లు ఆయన చెప్పారు. నూతన అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం కుదుర్చుకోవాలన్న తన ఆకాంఓను ట్రంప్‌ పుతిన్‌కు తెలియజేశారని వైట్‌ హౌస్‌ ప్రతినిధి తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/