ట్రంప్‌ ప్రభుత్వం కొత్త నిర్ణయం!

గర్భిణుల కోసం కొత్త వీసా నిబంధనలు తెచ్చే యోచన

pregnant women
pregnant women

వాషింగ్టన్‌: గర్భిణుల ఆశలపై నీళ్లు చల్లేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. వారి కోసం ప్రత్యేకంగా కొత్త వీసా నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ముసాయిదాను నేడు వెల్లడించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలు కనుక అమల్లోకి వస్తే పర్యాటక వీసాపై గర్భిణులు అమెరికా వెళ్లడం మరింత కష్టమవుతుంది. ఫలితంగా అమెరికాలో ప్రసవిస్తే అక్కడి పౌరసత్వం లభిస్తుందని భావించే వారికి ఇది చేదు గుళికగా మారనుంది. అయితే, ఈ నిబంధనను అమలు చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఆంక్షల పేరుతో అమెరికా వచ్చే వారికి ఝలక్ ఇస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇప్పుడు గర్భిణులపై దృష్టిసారించడం చర్చనీయాంశమైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/