మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్‌లోకి ఇకపై ప్రముఖ దిన పత్రికలు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ పత్రికలను తెప్పించుకోవద్దని నిర్ణయించారు. ఈ మేరకు తన అధికార నివాసంలో వాటి చందాలను రద్దు చేశారు. వాటిని నకిలీ పత్రికలుగా ఆరోపించిన ఆయన ప్రభుత్వ సంస్థలూ దీన్ని పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూయార్క్ టైమ్స్‌ను నకిలీ దిన పత్రికగా అభివర్ణించారు. వైట్‌హౌస్‌లో ఆ పత్రికలు మాకు అవసరం లేదు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ చందాలను మేం రద్దు చేయబోతున్నాం అని చెప్పారు. కాగా అవి నకిలివీ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. జర్నలిస్టులు ప్రజలకు శుత్రువులని ట్రంప్ అన్నట్లు తెలిపింది. తప్పుడు వార్తలు ప్రచురించిన సంస్థలు, జర్నలిస్టులపై దావా వేస్తామని ఆయన హెచ్చరించినట్లు పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ సంస్థలు ఈ పత్రికల చందాలను పునరిద్ధరించకపోతే చాలా ఆదా అవుతుంది అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషామ్ అన్నారు.
తాజా ఎడిటోరియల్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/editorial/