గ్రీన్‌కార్డుల పై కీలక ప్రకటన చేయనున్న ట్రంప్‌!

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈరోజు సాయంత్రం శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో ప్రసగించనున్నట్లు అధ్యక్ష భవన వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రసంగంలో ట్రంప్‌ గ్రీన్‌ కార్డుల జారీలో అమెరికాలో ఉంటున్న వారి కుటుంబీకులకు ప్రాధాన్యమిచ్చే విధానం స్థానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని ట్రంప్‌ ప్రకటిస్తారని తెలిపాయి. అయితే ఈ నూతన వలస విధానం ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్ ఆలోచన నుంచి ‌ రూపుదిద్దుకున్న ఈ విధానం ప్రకారం అమెరికా సాంకేతిక అవసరాలను తీర్చే వారికే గ్రీన్‌కార్డుల జారీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60 శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12 శాతం గ్రీన్‌కార్డులు జారీ చేస్తుండగా.. కొత్త విధానంలో 100 శాతం గ్రీన్‌ కార్డులు నైపుణ్యం ఆధారంగానే ఇవ్వనున్నారు. అదే జరిగితే భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లేవారు, అక్కడ హెచ్‌1బీ వీసాలపై ఉన్నవారికి త్వరగానే గ్రీన్‌కార్డులు లభించే అవకాశం దక్కనుంది.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/