టర్కీలో ట్రక్కును ఢీకొట్టిన రైలు

Truck Hit By Train
Truck Hit By Train

టర్కీ: రైల్వే పట్టాలపై ఓ ట్రక్కును రైలు ఢీ కొట్టిన ఘటన టర్కీలోని అఫియాన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. రైల్వే పట్టాలను దాటాల్సి ఉన్న సమయంలో నిబంధనలను ఉల్లంఘించి ట్రక్కు డ్రైవర్ దుస్సాహసానికి ప్రయత్నించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాకును దాటకూడదని, రైలు వస్తోందని సూచిస్తూ అక్కడ సిగ్నల్స్ పడ్డప్పటికీ, బారియర్లు మూసేసి ఉన్నప్పటికీ ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అదే సమయంలో రైలు వచ్చి ట్రక్కును ఢీ కొంది. ఆ ట్రక్కులోని బ్రెడ్ ప్యాకెట్లు అన్నీ నాశనమయ్యాయి. కొన్ని మీటర్ల వరకు ఎగిరిపడడంతో ట్రక్కు పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/