టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్: నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యాలయం ఎదుట టీఆర్టీ ఉపాధ్యాయుల బైఠాయించారు. దాదాపు 1000 మంది అభ్యర్థులు టీఆర్టీ ఉపాధ్యాయుల నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే నియామకాలపై సిఎం కెసిఆర్ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీఎస్పీఎస్సీ ద్వారా 2017లో నోటిఫికేషన్ జారీ చేసి, 2018 ఫిబ్రవరి 25న పరీక్ష నిర్వహించారని, అదే ఏడాది ఆగస్టులో 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారని అభ్యర్థులు తెలిపారు. అయితే నెలలు గడుస్తున్నా తుది ఫలితాలు విడుదల చేయకపోవడంతో వారు ఆందోళన చేట్టారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/