పార్టీ నాయకులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్
నెలాఖరులోగా జిల్లా పార్టీ , రాష్ట్ర కార్యవర్గం పూర్తి కావాలి
TS Minister KTR
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై మంత్రి కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23వ తేదీలోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా జిల్లా పార్టీ , రాష్ట్ర కార్యవర్గం పూర్తి కావాలన్నారు. 24వ తేదీలోగా తెలంగాణ భవన్‌కు నియోజకవర్గాల వారీగా.. సంస్థాగత నిర్మాణ వివరాలు అందజేయాలని కేటీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/