వేసవి సెలవులపై విద్యార్థి ట్వీట్‌..స్పందిచిన కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: వేసవి సెలవులను జూన్‌ 1కి బదులుగా 12కు పాఠశాలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వేసవి సెలవుల విషయంలో ఓ విద్యార్థి కెటిఆర్‌కు ట్విట్‌ చేశారు. ఉప్పల్‌లోని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తమ పాఠశాల ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందని.. జూన్‌ 12కు బదులుగా జూన్‌ 1వ తేదీనే పాఠశాలను పునఃప్రారంభిస్తుందని విద్యార్థి ఫిర్యాదు చేశాడు. 1 నుంచి 12వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తుందని విద్యార్థి తెలిపాడు. ఎండ వేడిమికి స్కూల్‌కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది అని విద్యార్థి ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై కెటిఆర్‌ స్పందించారు. వేసవి సెలవుల విషయంలో అన్ని పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలు పాటించేలా చూడాలని విద్యాశాఖ మంత్రికి కెటిఆర్‌ సూచించారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/