తెలంగాణ భవన్‌లో మంత్రి కెటిఆర్‌ ప్రెస్‌మీట్‌


TRS Working President KTR addressing the Media at Telangana Bhavan

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కెటిఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. తమ పట్ల ప్రగాఢ విశ్వాసం చూపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని కెటిఆర్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విపక్షాలు అనేక తిప్పలు పడ్డాయని, కొన్నిచోట్ల కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అన్నింటికి వారు తిలోదకాలిచ్చినప్పటికీ సంపూర్ణమైన ఆధిక్యాన్ని ప్రదర్శించాం. కేవలం 8 మున్సిపాలిటీలు ప్రత్యర్థులకు కోల్పోయి, 112 మున్సిపాలిటీలు గెలుచుకున్నాం. పదింటికి పది కార్పొరేషన్లు గెలుచుకున్నాం. ఇదేమీ మామూలు విషయం కాదు. ఇది కలలో కూడా ఊహించనంత గొప్ప విజయం అని పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/