వరంగల్‌, మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ గెలుపు

trs
trs

వరంగల్‌: వరంగల్‌, మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ గెలుపు సాధించింది. వరంగల్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి వసునూరి దయాకర్‌ 566367ఓట్ల తో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యకు 240101 ఓట్లు రాగ, బిజెపి అభ్యర్థి చింత సాంబమూర్తి 77325 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. 326266 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపీగా గెలుపొందారు.

మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు. శ్రీనివాస్‌రెడ్డికి 282255 ఓట్లు సాధించగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 225851 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచంద్‌రెడ్డి 119950 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. 56404 ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/