నేడు టిఆర్‌ఎస్‌ విస్తృత సమావేశం

పార్టీ కార్యాలయంలో ఉదయం 11.30 నుంచి ప్రారంభం

cm kcr
cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ఈరోజు టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరగనున్న రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం 11.30 నుంచి సాయంత్రం వరకు జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గసభ్యులు, మంత్రులు,పార్లమెంట్, రాజ్యసభ, శాసనసభ,శాసన మండలి, జిల్లాపరిషత్ ఛైర్మన్లకు పార్టీ ఆహ్వానం పంపించింది. పూర్తి స్థాయిలో ఆంతరంగికంగా జరిగే ఈ సమావేశంలో మున్సిపాలిటీ ఎన్నికల వ్యూహం పైనే చర్చజగనుందని టిఆర్‌ఎస్ నాయకులు చెప్పారు. ఈ మేరకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు నివేదికలతో సిద్ధమయ్యారు. మున్సిపాటిన్నికలతో పాటు పార్టీపరంగా నిర్వహించే కార్యక్రమాలు, శిక్షణతరగతులు, పార్టీ కార్యాలయాల నిర్మాణాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.

జిల్లాలవారిగా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు ఏమేరకు జరిగాయి, పార్టీకార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులపై చర్చజరిగే అవకాశాలున్నాయని నాయకులు చెప్పారు. అలాగే పార్టీపరంగా నిర్వహించే పలుకార్యక్రమాలపై ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం పార్టీశ్రేణులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలు పొంచి ఉన్ననేపథ్యంలో టిఆర్‌ఎస్ ఆధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ పరంగా అనేక అంశాలపై సుధీర్ఘంగా చర్చజరిపి ఎన్నికల కార్యాచరణ రూపొందించనున్నట్లు నాయకులు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ ఎన్నికలపై క్షేత్రస్థాయిలో పార్టీ అధిష్టానం నివేదికలను పరిశీలించి అభ్యర్థుల ఖరారుకు మార్గదర్శకాలు రూపొందించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/