నేడు మునుగోడులో టిఆర్ఎస్ ప్రజాదీవెన సభ..4 వేల కార్ల తో కేసీఆర్ భారీ ర్యాలీ

నేడు మునుగోడులో టిఆర్ఎస్ ప్రజాదీవెన సభ నిర్వహించబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ మొదలుకాబోతుంది. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన మునుగోడు కు బయలు దేరబోతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని టిఆర్ఎస్ , కాంగ్రెస్ , బిజెపి పార్టీ లు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు జరిగే టిఆర్ఎస్ సభ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని ప్రకటించే అవకాశం ఉంది.

హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12:30కు రోడ్డు మార్గంలో మునుగోడు కు సీఎం రానున్నారు. నాలుగువేల కార్ల భారీ కాన్వాయ్ తో మునుగోడుకు కేసీఆర్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4గంటల వరకు హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు చిట్యాల నుంచి రామన్నపేట మీదుగా ట్రాఫిక్ మళ్లించనున్నారు. మునుగోడు సభలో సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి సభ కోసం 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. ఐదుగురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డిఎస్పీలు, 50మంది సీఐలు, 94 మంది ఎస్సైలు విధుల్లో పాల్గొననున్నారు.