పార్టీ కార్యకర్తలకు కెటిఆర్ దిశానిర్దేశం

ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మనదవ్వాలి

TRS Working President KTR
TRS Working President KTR

సిరిసిల్ల : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్లలో ఉన్న 39 వార్డు కౌన్సిలర్ల స్థానాలు టిఆర్‌ఎస్ అభ్యర్థులే గెలవాలని బుధవారం సిరిసిల్ల శాసనసభ్యులు, టిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో ప్రత్యర్థులు ఎవరైనా గెలుపు మాత్రం టిఆర్‌ఎస్ అభ్యర్థులదే కావాలన్నారు. కోర్టులో ఎన్నికలు ఎప్పుడు జరపాలనే అంశం చర్చలో ఉందని కోర్టు తీర్పు వెలువడే లోపు ఓ దఫా ఇంటింటి ప్రచా రం పూర్తి కావాలని ఆయన సూచించారు, వార్డుల్లో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించాలని, ఆగస్ట్టు15 కల్లా ప్రతి ఇంటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటే వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తానన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/