ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ తెలంగాణ భ‌వ‌న్‌లో ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైంది. తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు స్వాగ‌తం ప‌లికారు. కొత్త‌గా నియామ‌క‌మైన కార్పొరేష‌న్ చైర్మ‌న్లు కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు.

పార్టీ విస్తృత స్థాయి స‌మావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధుదు సమితి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు దాదాపు 310-340 మంది కీలక నేతలు హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్ని స్థాయిల గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలో యాసంగి పంటల మార్పిడి, బీజేపీ ధ్వంద్వ విధానాలు, దళిత బంధు కార్యక్రమాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, పార్టీ శ్రేణులకు శిక్షణతో నామినేటెడ్ పదవుల భర్తీ తదితరుల అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ సందడిగా మారింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/