దుబ్బాక..16వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ జోరు

TRS Party
TRS Party

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం దాగుడుమూతలాడుతుంది. మొద‌టి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న బిజెపి చివ‌రి రౌండ్ల‌లో చ‌తికిల ప‌డిపోయింది. తొలి ఐదు రౌండ్లు, 8, 9, 11 రౌండ్ల‌లో బిజెపి మెజార్టీ సాధించ‌గా, టిఆర్‌ఎస్‌పార్టీ 6, 7, 13, 14, 15,16 రౌండ్ల‌లో భారీ మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్లింది. 15, 16 రౌండ్ల‌లో 1500 మెజార్టీ సాధించి.. విజ‌యం దిశ‌గా వెళ్తుంది. 15వ రౌండ్‌లో 955 ఓట్ల మెజార్టీ సాధించ‌గా, 16వ రౌండ్‌లో 749 ఓట్లు సాధించింది టిఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 12వ రౌండ్‌లో ఆధిక్యం సాధించింది. 16 రౌండ్లు ముగిసేస‌రికి బిజెపికి 1700 ఓట్ల మెజార్టీ మాత్ర‌మే ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/