ఈ 13న టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

KCR, ts cm
KCR, ts cm

హైదరాబాద్‌: ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎంపీలతో సియం కేసిఆర్‌ చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ 9 ఎంపి స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాలని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కేసిఆర్‌ ఆహ్వానం పంపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/