టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

kcr, ts cm
kcr, ts cm

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది, పార్టీ అధ్యక్షుడు, సియం కేసిఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో భేటి ప్రారంభమైంది. సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో ఈ నెల 17నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సియం చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ లోక్‌సభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అంశాలు, విడుదల కావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాల అమలులో కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే దానిపై చర్చించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/