టిఆర్‌ఎస్‌ ఎనార్నై సౌతాఫ్రికా కొత్త మంత్రులకు శుభాకాంక్షలు

TRS NRI Southafrica
TRS NRI Southafrica

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు టిఆర్‌ఎస్‌ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ శుభాకాంక్షలు తెలిపింది. ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతు కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు సిఎం కి పూర్తి సహాయ సహాకారాలు అందించి తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌  ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు.