కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచిన టిఆర్‌ఎస్‌ ఎంపీలు

TRS Party
TRS Party

హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చేయి చూపించారని తెలంగాణ టిఆర్‌ఎస్‌ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోరుకున్న అంశాలను కేంద్రం పట్టించుకోలేదని, కేంద్ర బడ్జెట్ లో వాటి గురించి ప్రస్తావించలేదని టిఆర్‌ఎస్‌ ఎంపీలు పెదవి విరిచారు. ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేలా ఈ బడ్జెట్ లేదని, విభజన చట్టంలోని అంశాల గురించి, తెలంగాణ జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్ ప్రస్తావించలేదని, రైతులకు, నీటి ప్రాజెక్ట్ లకు ఈ బడ్జెట్ అనుకూలంగా లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించకపోవడం సబబు కాదని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/