గాంధీ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, నేతకాని వెంకటేశ్, రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు.
నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే. కేశవరావు, లోకసభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/