పార్లమెంట్ ఆవరణ లో రాహుల్ తో కలిసి టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన

నిత్యావసరాల ఫై కేంద్రం విధించిన GST ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణ లో రాహుల్ తో కలిసి టిఆర్ఎస్ ఎంపీల ఆందోళన చేపట్టారు. పెంచిన GST పన్నును వెంటనే తొలగించాలని వారంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ పక్కనే టిఆర్ఎస్ ఎంపీ కేకే నిల్చోని మరి తమ నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అన్ని పార్టీలను కలుపుకుని పోతామని రెండు పార్టీలు చెబుతున్నాయి. ఇక అటు పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నేడు టిఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలుపాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

పార్లమెంట్ లో ధరల పెరుగుదలను నిరసిస్తూ సభ్యులు సభలో ఆందోళనకు దిగడం, పార్లమెంట్ బయట సైతం గాంధీ విగ్రహం ముందు బ్యానర్లు ప్రదర్శిస్తూ బైఠాయించారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది. లోక్​సభలోనూ నిరసనలు హోరెత్తడం వల్ల.. సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇప్పటికే పలు వాటిపై GST పేరుతో భారం మోపుతున్న కేంద్ర సర్కార్..ఇప్పుడు నిత్యావసరాలను కూడా వదల్లేదు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలు , ఉప్పు , పప్పు, కూరగాయలు ఇలా ఏది వదలకుండా అన్నింటిపై GST భారం మోపుతోంది. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబును కేంద్రం ఇలా దర్జాగా పన్నుల పేరుతో దోచేస్తుండటంతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.