ఏపి శాసనమండలి రద్దు అర్థరహితం

తెలంగాణ ఎంపి కే.కేశవరావు

K. Keshava Rao
K. Keshava Rao

హైదరాబాద్‌: ఏపి శాసనమండలి రద్దు నిర్ణయంపై తెలంగాణ ఎంపి, టిఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే. కేశవరావు తాజాగా స్పందించారు. అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజా గా ఆ జాబితాలో ఎంపి కేకే కూడా చేరారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ శాసనమండలి రద్దు అర్థరహితమని వ్యాఖ్యానించారు. కౌన్సిల్ పెద్దల సభగా కొనసాగాలాని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏపి ముఖ్యమంత్రి మండలి నిర్వహణపై చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన తప్పుపట్టారు. మండలి వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టమనడం నాన్సెన్స్ అని కేకే అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో అదేమీ పెద్ద ఖర్చు కాదని కేకే పేర్కొన్నారు. శాసన సభ నిర్వహణా వ్యయంలో కేవలం 3 శాతం వ్యవయంతోనే మండలి నడపవచ్చని ఆయన అన్నారు. అందుకే అసలు ఖర్చు విషయమే తలెత్తదని కేకే కొట్టిపారేశారు. ప్రజాస్వామ్యంలో రెండో అభిప్రాయం తప్పని సరి అన్నారు. ఎవరైనా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే దాన్ని పెద్దలు సరిచేస్తారని ఆయన సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/