నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

TELANGANA LEGISLATIVE COUNCIL
TELANGANA LEGISLATIVE COUNCIL

హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలి సభ్యులుగా నవీన్‌రావు, పట్నం మహేందర్‌ రెడ్డి, తేరా చిన్నప్పరెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ నలుగురి చేత మండలి డిప్యూటి ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కోటా కింద నవీన్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos