కొండ‌గ‌ట్టులో రామ‌కోటి స్తూపానికి కవిత భూమి పూజ

కొండ‌గ‌ట్టు అంజ‌న్న భ‌క్తుల కొంగు బంగారం ..ఎమ్మెల్సీ క‌విత‌

కొండగట్టు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయదలచిన రామకోటి స్తూపానికి కవిత భూమి పూజ చేశారు. అంతేకాకుండా అఖండ హనుమాన్ చాలీసా పారాయణం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వేదపండితులు పాల్గొన్నారు.


భూమి పూజ అనంత‌రం క‌విత మీడియాతో మాట్లాడారు. కొండ‌గ‌ట్టు అంజ‌న్న తెలంగాణ ప్ర‌జ‌ల కొంగు బంగారం అని అన్నారు.అన్నారు. కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ సేవా స‌మితి ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇంటింట్లో హ‌నుమాన్ చాలీసా జ‌రిగేలా ప్ర‌ణాళిక రూపొందిస్తామ‌ని చెప్పారు. ఈ నెల 17 నుంచి అఖండ హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం నిర్వ‌హిస్తామ‌ని క‌విత తెలిపారు. కొండ‌గ‌ట్టు అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/