నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్సీ క‌విత

నిజామాబాద్ : ఎమ్మెల్సీ క‌విత ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పులాంగ్ చౌర‌స్తాలోని పులాంగ్ పార్క్‌ను ఎమ్మెల్సీ క‌విత సంద‌ర్శించారు. పార్కు నిర్మాణ ప‌నుల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. పార్కు సంద‌ర్శ‌న కంటే ముందు.. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త అధ్వర్యంలో చేపట్టిన ఉచిత భోజ‌న వితరణ ముంగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ క‌విత పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. భోజ‌న విత‌ర‌ణ కార్య‌క్ర‌మం చాలా గొప్ప‌ది అని పేర్కొన్నారు. క‌రోనా స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మం చాలా మందికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఇంకా కొద్ది రోజులు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/