మోడీకి చెప్పులతో స్వాగతం పలుకుతాం అంటున్న టిఆర్ఎస్ నేతలు

trs mla vivekananda comments to modi hyderabad tour

బిజెపి పార్టీ..ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఎలాగైనా కమలం జెండా ఎగురవేయాలని చూస్తుంది. దీనికి తగ్గట్లే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ తరుణంలో వచ్చే నెలలో ప్రధాని మోడీ తో పాటు నేతలు హైదరాబాద్ కు రాబోతున్నారు. జులై 1న మధ్యాహ్నం 3 గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకుంటారు. జులై 2న ప్రధాని మోడీ హైదరాబాద్‌ రానున్నారు. జులై 03 న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభ ను సక్సెస్ చేసే పనిలో బిజెపి శ్రేణులు ఉన్నారు. ఇదిలా ఉంటె మోడీకి చెప్పులతో స్వాగతం పలుకుతామని హెచ్చరించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. పంజాబ్ లో ప్రజల చేత తిరస్కరించబడ్డ నేత తరుణ్ చుగ్…ఆయన వచ్చి ఇక్కడ కేసిఆర్ మీద మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తరుణ్ చుగ్ మీ పనులు మీరు చూసుకోండి, మా నాయకుని మీద బురద జల్లితే ఊరుకోమని హెచ్చరించారు. తరుణ్ ఛుగ్ ఒళ్ళుదగ్గర పెట్టుకుని మాట్లాడాలి..అని పేర్కొన్నారు.భ్యాగ్య లక్ష్మి అమ్మదగ్గరికి వచ్చి మొక్కుడు కాదు, ఏం నిధులు తీస్తారో చెప్పండి..మోడీ కంటే 17ఏళ్ల ముందే కేసిఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీకి వెళ్లారన్నారు.

ప్రత్యేక ఎజెండా అంటేనే బీజేపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారని మంత్రి జగదీష్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి ప్రయాణం అంటేనే హస్తినకు వణుకు మొదలైందన్నారు. అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో మోడీ దండు హైదరాబాద్ కు బయలు దేరారని మంత్రి ఎద్దేవ చేశారు. దేశప్రజల ఆకాంక్షలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా తెలుసని అన్నారు. ఎక్కడ వ్యక్తికరించాలో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలీదు అన్నారు. మోడీ సర్కార్ దేశాన్ని చీకట్లోకి నెట్టిందని మంత్రి దుయ్యబట్టారు. దేశంలో వెలుగులు నింపడం ముఖ్యమంత్రి కేసీఆర్ తోటే సాధ్యం అని పేర్కొన్నారు.