చిల్లర మాటలు మాట్లాడితే ఉన్న మూడు సీట్లు కూడా పోతాయి

బెంగాల్ లో మాదిరిగా ఉరికించి కొడుతాం: జేపీ నడ్డాకు జీవన్ రెడ్డి వార్నింగ్

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బండి సంజయ్, అరవింద్ లపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. జేపీ నడ్డా సీఎం కేసీఆర్ కు క్షమాపణులు చెప్పాలన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ లీడర్లు..గల్లీ లీడర్లు రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. నడ్డా సీఎం కేసీఆర్ కు క్షమాపణలు చెప్పాలని, లేదంటే పశ్చిమబెంగాల్ లో మాదిరిగా.. ఉరికించి కొడుతామన్నారు. చిల్లర మాటలు మాట్లాడితే.. రాష్ట్రంలో ఉన్న మూడు సీట్లు కూడా పోతాయని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/