ఎన్‌కౌంటర్‌ బాధాకరం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Gongidi Suntiha
Gongidi Suntiha

యాదాద్రి: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ బాధాకరమని నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన యువకుల తల్లిదండ్రులు ఎంతో బాధపడి ఉంటారని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు గొంగిడి సునీత. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గొంగిడి సునీత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె తీరుపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. నిందితులను చంపేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిపని చేస్తే… అదే పార్టీకి చెందిన మీరు తప్పుబట్టుతారా? అంటూ విమర్శిస్తున్నారు కొందరు నెటిజన్లు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/