టిఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

trs
trs

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి కార్యవర్గ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈరోజు నుంచి ప్రారంభించనున్న టిఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుపై నేతలు చర్చిస్తున్నారు. కోటి సభ్యత్వాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష చొప్పున చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇదే సమయంలో గ్రామ, మండల స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఐదునెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దానిపైనా నేతలకు సిఎం కెసిఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌ , కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ , పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, ముఖ్య నేతలు హాజరయ్యారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/