16న టిఆర్‌ఎస్‌ జాబితా!

trs
trs

హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 15న కాంగ్రెస్‌ జాబితా విడులయ్యే వీలుంది. దీనిని పరిగణనలోకి తీసుకొని సీఎం 16న తుది జాబితా వెల్లడించాలని భావిస్తున్నట్లు సమాచారం. శాసనసభా ఎన్నికల సమయంలోనూ సీఎం మొదటి జాబితాను ముందుగానే విడుదల చేశారు. రెండో జాబితా కాంగ్రెస్‌ జాబితా వెల్లడి అనంతరమే విడుదలయింది. ఈసారి కూడా సీఎం అదే వ్యూహంతో ఉన్నారు. దాదాపు ఆరు స్థానాలకు అభ్యర్థులు ఖరారవగా వాటితో బుధవారం ఒక విడత పేర్లను వెల్లడించాలని సీఎం భావించినా తాజా వ్యూహంలో భాగంగా దానిని విడుదల చేయలేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌ 15న జాబితా ప్రకటించకపోతే సీఎం
ఆరుగురు తెరాస అభ్యర్థుల జాబితాను ముందుగా వెల్లడిరస్తారు. కాంగ్రెస్‌ జాబితా వచ్చాక మిగిలిన 10 మంది పేర్లను వెల్లడించబోతున్నారని సమాచారం. ఈ నెల 15, 16 తేదీల్లో కేసీఆర్‌ ఎంపీలకు, ఎంపీ అభ్యర్థులకు విందునివ్వనున్నారు. ఎంపికైన వారితో, ఎంపికకాని వారితో విడివిడిగా సమావేశం నిర్వహించనున్నారు. కొంత మంది ఎంపీలను మార్చే అవకాశం ఉందని ఇప్పటికే ఆయన సంకేతాలు ఇచ్చారు. ఎంపీలతో మాట్లాడి, వారికి ప్రస్తుత పరిస్థితులు, సర్వే వివరాలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు వివరించాలని, అలాగే టికెట్లు దక్కని వారితో మాట్లాడి వారు అసంతృప్తికి గురికాకుండా వారికి కల్పించనున్న అవకాశాలను తెలియజేస్తారని తెలిసింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/