సైదిరెడ్డికి 18 వేల ఓట్లకు పైగా ఆధిక్యం

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పద్మావతి!

trs
trs

హుజూర్ నగర్ : హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక్కడ 10 రౌండ్ల కౌంటింగ్ ముగిసేవరకు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 18 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆయన గెలుపు దాదాపు ఖాయమైపోగా, ఆయన మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. తాను ముందుగా చెప్పినట్టుగానే బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నానని ఈ సందర్భంగా సైదిరెడ్డి వ్యాఖ్యానించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/