కేటీఆర్ ఫై వైసీపీ నేతల కౌంటర్లు ..వైసీపీ నేతల ఫై తెరాస నేతల రివర్స్ కౌంటర్లు

minister-ktr-speech-in-credai-property-show

ఏపీలోని పరిస్థితుల ఫై కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. హెచ్ఐసీసీలో జరిగిన ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ కామెంట్స్ చేసారు.ఏపీలో క‌రెంట్ లేదని.. నీళ్ళు లేవని.. రోడ్లు ధ్వంసం అయ్యాయన్నారు.అక్కడి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. తన మిత్రుడు ఊరినుంచి తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్న‌ట్లు ఉందని చెప్పాడన్నారు. ఈ కామెంట్స్ ఫై వైసీపీ నేతలు వరుసపెట్టి కౌంటర్లు వేస్తున్నారు.

ఏపీలో విద్యుత్‌ కోతలు లేవు. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లు బాగుపడ్డాయి. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్‌ అలా మాట్లాడి ఉండొచ్చు. ఏపీలో పరిస్థితి బాగాలేదు.. తెలంగాణలో అంతా బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్‌ భావించారేమోనని’ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవ‌రో స్నేహితుడు చెప్పాడేమో కానీ తాను నిన్న‌టి వరకు హైద‌రాబాద్‌లోనే ఉన్నానని తెలిపారు. జనరేటర్‌ వేసుకొని ఉండివచ్చానన్నారు. తెలంగాణ‌లో ప‌రిస్థితుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసినప్పటికీ తాను ఎవ‌రికి చెప్పుకోవడం లేదు క‌దా అని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు. తాను ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్డుమీదే నిలబడి మాట్లాడుతున్నానని, కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో స్వయంగా చూపిస్తానని పేర్కొన్నారు.

అయితే వైసీపీ నేతల కౌంటర్లకు టీఆరఎస్ పార్టీ నేతలు కూడా అంతే విధంగా రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. బొత్స వ్యాఖ్య‌ల‌కు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. “తెలంగాణ‌లో 2 నిమిషాలు కూడా క‌రెంట్ పోదు. బొత్స క‌రెంట్ బిల్లు క‌ట్ట‌లేదేమో. అందుకే క‌ట్ చేశారు. వైసీపీ నేత‌ల కుటుంబాలు హైద‌రాబాద్‌లోనే ఉంటున్నాయి. ఇక్క‌డే ఉన్న జ‌గ‌న్ కుటుంబాన్ని అడిగినా తెలుస్తుంది. కేసీఆర్ పాల‌న బాగుంద‌ని వైసీపీ ఎంపీలే చెప్పారు” అంటూ సెటైరిక‌ల్ కామెంట్లు చేశారు. ఏపీపై కేటీఆర్ ఉన్న మాటే అన్నారని.. నిజమే అక్కడ రోడ్లు అద్వానంగా ఉన్నాయని చురకలు అంటించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఏపీ నాయకులకు అంత అక్కసు ఎందుకు ? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో జనరేటర్లు పెట్టుకునే పరిస్థితి ఏమి లేదని.. హైదరాబాద్ లో ఉండే ఎపి నాయకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నామని తేల్చి చెప్పారు.

వైసీపీ నేతలు వరుసపెట్టి కౌంటర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి..వైసీపీ నేతలకు కౌంటర్ వేసాడు. కేటీఆర్ తప్పుగా ఏమి మాట్లాడాడలేదని, ఉన్న మాటే అన్నారని.. నిజమే అక్కడ రోడ్లు అద్వానంగా ఉన్నాయని చురకలు అంటించారు. హైదరాబాద్ లో జనరేటర్లు పెట్టుకునే పరిస్థితి ఏమి లేదని.. హైదరాబాద్ లో ఉండే ఎపి నాయకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నామని అన్నారు.

తెరాస ఎంపీ రంజిత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో రెండు రోజులు కరెంట్ పోయే పరిస్థితి ఉందా ? అని నిలదీశారు. కరెంట్ బిల్లు కట్టకపోయి ఉంటే బొత్స ఇంటికి కరెంట్ కట్ చేసి ఉండవచ్చన్నారు. హైదరాబాద్ లో ఇప్పడు ఇన్వర్ట్ లు ఉన్నాయా ? అని నిలదీశారు. వైసీపీ ఎంపీలు మేము కేసీఆర్ ఫ్యాన్స్ అని నాకు చాలా మంది చెప్పారని.. 28 రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలను వాళ్ళు కాపీ చేస్తున్నారని మండిపడ్డారు.